మళ్లీ టాప్‌ లేపిన విరాట్‌ కోహ్లి

Virat Kohli Returns To The Top Of ICC Test Rankings  - Sakshi

నాటింగ్‌హామ్‌: ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలిస్తే ఆ కిక్కే వేరుంటుంది. ఇప్పుడా ఆ మధుర క్షణాల్ని, ఆనందాన్ని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి అనుభవిస్తున్నాడు. 2014లో ఇంగ్లండ్‌ గడ్డపై చేదు అనుభవాన్ని తుడిచి వేస్తూ ప్రస్తుత సిరీస్‌లో అదరగొడుతున్న కోహ్లి.. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ఆగ్రస్థానాన్ని ఆక్రమించాడు. 937 పాయింట్లతో టెస్టు నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 929 పాయింట్లతో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ రెండో స్థానానికి పడిపోయాడు . కోహ్లీ టెస్టు కెరీర్‌లోనే ఇన్ని రేటింగ్‌ పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. అత్యధిక రేటింగ్‌ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం 11వ స్థానంలో నిలిచాడు. మరొక్క పాయింట్‌ సాధిస్తే ఆల్‌టైమ్‌ అత్యధిక రేటింగ్‌ పాయింట్లు సాధించిన టాప్‌  10 ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదిస్తాడు. డాన్‌ బ్రాడ్‌మన్‌ (961), స్టీవ్‌ స్మిత్‌(947)లు ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. 

అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు అనంతరం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో కోహ్లీ మొదటిసారి టెస్టుల్లో నంబర్‌వన్‌ ర్యాంకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ విఫలమవ్వడంతో మళ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. తాజాగా  నాటింగ్‌హామ్‌లో చేసిన ప్రదర్శనకు గానూ కోహ్లీ తిరిగి నంబర్‌వన్‌ స్థానాన్ని సాధించాడు.

మిగతా ఆటగాళ్లలో చటేశ్వర పుజారా ఆరవ స్థానంలో కొనసాగుతుండగా.. అజింక్యా రహానే 19వ, ధావన్‌ 22వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకి 51 వ స్థానంలో నిలవగా, బౌలింగ్‌లో 23 స్థానాలు మెరుగుపర్చుకొని 51వ స్థానం ఆక్రమించాడు. ఆల్‌రౌండర్‌ జాబితాలో 17వ స్థానాన్ని పాండ్యా సాధించాడు. ఇక బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్‌, షమీలు వరుసగా 7,22  స్థానాలలో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top