‘మిక్స్‌డ్‌’ ఫైనల్లో జ్యోతి సురేఖ జంట | Surekha and Abhishek in final | Sakshi
Sakshi News home page

‘మిక్స్‌డ్‌’ ఫైనల్లో జ్యోతి సురేఖ జంట

Nov 28 2017 12:44 AM | Updated on Nov 28 2017 12:47 AM

Surekha and Abhishek in final  - Sakshi

ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్‌ వర్మ (భారత్‌) జంట 154–153తో చెన్‌ లి జు–పాన్‌ యు పింగ్‌ (చైనీస్‌ తైపీ) జోడీపై విజయం సాధించింది. మంగళవారం జరిగే ఫైనల్లో సో చెవన్‌–కిమ్‌ జాంగ్‌హో (దక్షిణ కొరియా) ద్వయంతో జ్యోతి సురేఖ–అభిషేక్‌ జంట తలపడుతుంది. అంతకుముందు క్వార్టర్‌ ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్‌ ద్వయం 157–151తో పరీసా బరాచి–ఇస్మాయిల్‌ ఇబాది (ఇరాన్‌) జోడీపై గెలిచింది. క్వాలిఫయింగ్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కొరియా (1419 పాయింట్లు), భారత్‌ (1412 పాయింట్లు) జోడీలకు నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు ‘బై’ లభించింది. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement