అజహర్‌ తర్వాత కోహ్లినే

Virat Kohli Placed Second Indian captains enforcing follow on most times - Sakshi

రాజ్‌కోట్‌: ఇప్పటికే ఎన్నో ఘనతల్ని సాధించిన భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ప్రత‍్యర్థి జట‍్లను ఫాలోఆన్‌ ఆడించడంలో కూడా తన మార్కును చూపెడుతున్నాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో విండీస్‌ ఫాలోఆన్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా అత్యధిక సార్లు ఫాలోఆన్‌ ఆడించిన భారత కెప్టెన్ల జాబితాలో కోహ్లి రెండో స్థానంలో నిలిచాడు.

ఇప్పటివరకూ ప్రత్యర్థి జట్టును కోహ్లి ఐదు సార్లు ఫాలోఆన్‌కు ఆహ్వానించగా, మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ ఏడుసార్లు ఫాలోఆన్‌ ఆడించాడు. దాంతో ఎక్కువ సార్లు ఫాలోఆన్‌ ఆడించిన భారత క్రికెట్‌ కెప్టెన్ల జాబితాలో కోహ్లి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలోనే సౌరవ్‌ గంగూలీ-ఎంఎస్‌ ధోనిలను కోహ్లి అధిగిమించాడు. గంగూలీ-ధోనిలు తమ క్రికెట్‌ కెరీర్‌లో కెప్టెన్లగా ఉన్న సమయంలో ప‍్రత్యర్థి జట్టును నాలుగుసార్లు ఫాలోఆన్‌ ఆడించారు. ఇప్పటివరకూ వీరితో కలిసి కోహ్లి సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా, దాన్ని తాజాగా సవరించాడు. ఇక సునీల్‌ గావస్కర్‌-రాహుల్‌ ద‍్రవిడ్‌లు మూడేసిసార్లు ఫాలోఆన్‌లో భాగస్వామ్యమై నాలోస్థానంలో ఉన్నారు.

టీమిండియా రికార్డు ‘ఇన్నింగ్స్‌’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top