కోహ్లి సెన్సేషనల్‌ క్యాచ్‌! | Virat Kohli opens up about that sensational catch to dismiss Rahul Tripathi | Sakshi
Sakshi News home page

కోహ్లి సెన్సేషనల్‌ క్యాచ్‌!

Apr 17 2017 10:17 AM | Updated on Sep 5 2017 9:00 AM

కోహ్లి సెన్సేషనల్‌ క్యాచ్‌!

కోహ్లి సెన్సేషనల్‌ క్యాచ్‌!

రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌ లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పట్టిన క్యాచ్‌ హైలెట్‌ గా నిలిచింది.

బెంగళూరు: ఐపీఎల్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌తో ఆదివారం చినస్వామి మైదానంలో జరిగిన మ్యాచ్‌ లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పట్టిన క్యాచ్‌ హైలెట్‌ గా నిలిచింది. కోహ్లి పట్టిన సెన్సేషనల్‌ క్యాచ్‌ అభిమానులతో సహా పుణె ఆటగాళ్లను విస్మయానికి గురిచేసింది. ఊహించని రీతిలో బంతిని అందుకుని దూకుడుమీదున్న పుణె ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠిని పెవిలియన్‌ దారి పట్టించాడు. 9వ ఓవర్‌ లో పవన్‌ నేగి బౌలింగ్‌ లో త్రిపాఠి కొట్టిన బంతిని ఎడమవైపుకు డైవ్‌ చేసి కోహ్లి ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టాడు. బ్యాట్స్‌ మన్‌ అలా షాట్‌ కొట్టాడో లేదో ఆర్సీబీ కెప్టెన్‌ క్యాచ్‌ పట్టడం, వెంటనే బంతిని గాల్లోకి విసిరేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.

కష్టసాధ్యమైన క్యాచ్‌ ను ఊహించనిరీతిలో పట్టడంతో త్రిపాఠి కొద్ది నిమిషాల పాటు విస్మయానికి గురయ్యాడు. ఆశ్చర్యంగా చూస్తూనే పెవిలియన్‌ కు చేరాడు. మ్యాచ్‌ ఓడినప్పటికీ తనదైన ఆటతీరుతో అభిమానులకు కోహ్లి వినోదం పంచాడు. ‘నేను పట్టిన అరుదైన క్యాచుల్లో ఇది కూడా ఒకటి. ట్రైనింగ్‌ లో నేను తీసుకున్న శిక్షణ ఇక్కడ ప్రతిఫలించింద’ని మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లి అన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement