ఖలీతో కోహ్లి.. కామెంట్లే.. కామెంట్లు.. | Virat Kohli Meets The Great Khali And Twitter Is Amused | Sakshi
Sakshi News home page

ఖలీతో కోహ్లి.. కామెంట్లే.. కామెంట్లు..

Aug 7 2017 12:00 PM | Updated on Sep 17 2017 5:16 PM

ఖలీతో కోహ్లి.. కామెంట్లే.. కామెంట్లు..

ఖలీతో కోహ్లి.. కామెంట్లే.. కామెంట్లు..

భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డబ్ల్యూడబ్ల్యూఈ భారత రెజ్లింగ్‌ స్టార్‌ ఖలీని కలిసాడు.

కొలంబో: భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డబ్ల్యూడబ్ల్యూఈ భారత రెజ్లింగ్‌ స్టార్‌ ఖలీని కలిసాడు. వీరిద్దరూ పక్కపక్కకు నిలబడి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వీరి ఫోటోపై నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. శ్రీలంకతో రెండో టెస్టు విజయానంతరం కోహ్లి సరదాగా ఈ పంజాబ్‌ రెజ్లర్‌ను కలిసాడు.
 
ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను కోహ్లి సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. క్యాప్షన్‌గా ఖళీ వంటి గొప్పవ్యక్తిని కలవడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. ఇక డబ్ల్యూడబ్ల్యూలో ఖలీకి ఎంత ఆదరణ ఉందో అందరికి తెలిసిన విషయమే..
 
ఈ ఫోటోలో పొడగ్గా పటిష్టమైన ఆకారంతో ఉండే ఖలీ పక్కన కోహ్లి చిన్న పిల్లాడిలా ఉన్నాడు. దీంతో నెటిజన్లు జోక్స్‌ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. కోహ్లి ఖలీ ముందు నీవు చిన్నపిల్లాడిలా ఉన్నావని ఒకరు.. నీకు ఇలాంటి పొడువైన బౌలర్‌ కావాలి కదా అని మరోకరు.. నీ నుంచి ఖలీ బ్యాటింగ్‌ నేర్చుకున్నాడని మరోకరు ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement