కోహ్లీ చాంపియన్ గానీ.. సచినే నెంబర్ వన్! | virat kohli is a champion, but sachin is always number one, says harbhajan singh | Sakshi
Sakshi News home page

కోహ్లీ చాంపియన్ గానీ.. సచినే నెంబర్ వన్!

Feb 21 2017 6:47 PM | Updated on Sep 5 2017 4:16 AM

కోహ్లీ చాంపియన్ గానీ.. సచినే నెంబర్ వన్!

కోహ్లీ చాంపియన్ గానీ.. సచినే నెంబర్ వన్!

సచిన్ టెండూల్కర్‌ను, విరాట్ కోహ్లీని పోల్చాలంటే సాధ్యమేనా? భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు సరిగ్గా ఇలాంటి సమస్యే వచ్చింది.

సచిన్ టెండూల్కర్‌ను, విరాట్ కోహ్లీని పోల్చాలంటే సాధ్యమేనా? భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు సరిగ్గా ఇలాంటి సమస్యే వచ్చింది. విరాట్ కోహ్లీ ఇప్పుడు ఛాంపియనేనని, కానీ మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కర్ మాత్రం ఎప్పటికీ నెంబర్ వన్‌గానే ఉంటాడని చెప్పి జాగ్రత్తగా తప్పించుకున్నాడు. ఇటీవలి కాలంలో కోహ్లీ అద్భుతంగా రాణిస్తుండటంతో చాలామంది అతడిని సచిన్‌తో పోలుస్తున్నారు. వన్డేలలో టెండూల్కర్ రికార్డులను ఒక్కొక్కటిగా బద్దలు కొడుతున్నా, టెస్టుల్లో మాత్రం క్రికెట్ దైవాన్ని అందుకోవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. 
 
బ్యాటింగుకు సంబంధించిన అన్ని రికార్డులనూ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టే అవకాశం ఉందని, కానీ సచిన్ మాత్రం సచినేనని హర్భజన్ అన్నాడు. దేశంలో తాను, విరాట్ సహా చాలామంది కేవలం సచిన్ వల్లే క్రికెట్ ఆడుతున్నామని చెప్పాడు. ఎంతైనా పాజీ పాజీయేనని ప్రశంసల్లో ముంచెత్తాడు. ఇక విరాట్ కోహ్లీకి క్రికెట్ అంటే ప్రాణమని, అదే అతడిని ఇంత ఎత్తుకు తీసుకెళ్తోందని చెప్పాడు. తాను మాత్రమే ఫిట్‌గా ఉండటం కాకుండా మిగిలినవాళ్లను కూడా ఫిట్‌గా ఉండేలా స్ఫూర్తినిస్తాడన్నాడు. ఆస్ట్రేలియా మీద టెండూల్కర్‌కు మంచి రికార్డు ఉందని, కోహ్లీ ఇప్పుడు దాన్ని కొనసాగించాలని ఆశించాడు. గత జూలై నుంచి ఇప్పటికి కోహ్లీ నాలుగు డబుల్ సెంచరీలు కొట్టిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement