మేమిద్దరం మిత్రులమే! | Virat Kohli and I still good friends: David Warner | Sakshi
Sakshi News home page

మేమిద్దరం మిత్రులమే!

Apr 7 2017 11:20 PM | Updated on Sep 5 2017 8:11 AM

మేమిద్దరం మిత్రులమే!

మేమిద్దరం మిత్రులమే!

ఇటీవల ముగిసిన భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కొనసాగిన మాటల యుద్ధాలు, కవ్వింపులు

 హైదరాబాద్‌: ఇటీవల ముగిసిన భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కొనసాగిన మాటల యుద్ధాలు, కవ్వింపులు ఇంకా ఎవరూ మరిచిపోలేదు. రాంచీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్‌ అవుటయ్యాక కోహ్లి తన భుజంపై చేయి పెట్టి చేసిన సైగ కూడా అందరికీ గుర్తుండిపోయింది. అయితే వార్నర్‌ మాత్రం అదంతా ఆటలో భాగమేనని, తమ మధ్య మంచి స్నేహం ఉందని చెబుతున్నాడు. ‘ఐపీఎల్‌ ప్రారంభోత్సవం సమయంలో మేమిద్దరం ఎంతో మాట్లాడుకున్నాం.

అదృష్టవశాత్తూ మా మధ్య మంచి స్నేహమే ఉంది. ఇద్దరం మెసేజ్‌లు కూడా పంపించుకున్నాం. ఈ విషయంలో కోహ్లి స్పందన కూడా బాగుంది. మైదానంలో గెలవాలనే కసిలో కొన్ని ఘటనలు జరుగుతాయి. ఆ కొద్దిసేపు ఉద్వేగాలను అదుపు చేయలేం. ఆ తర్వాత అంతా సాధారణంగా మారిపోతుంది’ అని వార్నర్‌ అభిప్రాయపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement