సీబీఎస్‌ఈ క్లస్టర్-7 ఖోఖో టోర్నమెంట్‌లో విజ్ఞాన్ స్కూల్ సెమీఫైనల్‌కు చేరుకుంది.
నిజాంపేట, న్యూస్‌లైన్: సీబీఎస్‌ఈ క్లస్టర్-7 ఖోఖో టోర్నమెంట్‌లో విజ్ఞాన్ స్కూల్ సెమీఫైనల్‌కు చేరుకుంది. శనివారం బాలుర విభాగంలో జరిగిన ఈ పోటీల్లో మహర్షి విద్యామందిర్, బి.డి.ఎల్, డి.ఎ.వి, కర్ణాటకకు చెందిన శ్రీవిద్యానికేతన్ ఎంకేఈటీఎస్, కల్పతరు సెంట్రల్ పబ్లిక్ స్కూల్, డి.ఎ.వి. కూకట్‌పల్లి, భారతీయ విద్యాభవన్ బీహెచ్‌ఈఎల్, గుంటూరుకు చెందిన భాష్యం బ్లూమ్, మారుతీ విద్యాకేంద్రం పాఠశాలలు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఆదివారం జరిగే ముగింపు ఉత్సవానికి యు.జి.సి జాయింట్ సెక్రటరీ డాక్టర్ జి.శ్రీనివాస్ పాల్గొననున్నారు.