వారెవా.. వెటోరి | Vettori leaps And Grabs a Beauty! | Sakshi
Sakshi News home page

వారెవా.. వెటోరి

Mar 22 2015 12:36 AM | Updated on Sep 2 2017 11:11 PM

వారెవా.. వెటోరి

వారెవా.. వెటోరి

36 ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని ‘డాన్’ వెటోరి ఫీల్డింగ్‌లో ఒక అద్భుతాన్ని చూపించాడు. బౌల్డ్ వేసిన పదో ఓవర్ తొలి బంతిని శామ్యూల్స్ అప్పర్‌కట్ ఆడాడు.

36 ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని ‘డాన్’ వెటోరి ఫీల్డింగ్‌లో ఒక అద్భుతాన్ని చూపించాడు. బౌల్డ్ వేసిన పదో ఓవర్ తొలి బంతిని శామ్యూల్స్ అప్పర్‌కట్ ఆడాడు. థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి వెళ్లిన బంతి దాదాపు బౌండరీ దాటి సిక్స్‌గా మారినట్లే కనిపించింది. కానీ ఇంతలో అక్కడే ఉన్న వెటోరి అనూహ్యంగా చాలా ఎత్తులో గాల్లోకి ఎగిరాడు. ఎలాంటి ఒత్తిడి, గందరగోళం లేకుండా తనని తాను అదుపులో ఉంచుకుంటూ పర్‌ఫెక్ట్‌గా చేతిని గాల్లో ఉంచాడు. అంతే...సరిగ్గా బంతి అతని చేతుల్లో పడింది. ఈ ఒంటి చేతి సూపర్ క్యాచ్‌తో శామ్యూల్స్ అవుట్ కావడంతో ఆ దశలో విండీస్ జోరుకు బ్రేక్ పడింది.

Advertisement
 
Advertisement
Advertisement