టాప్‌ స్టార్లంతా బరిలోకి

At the US Open, the gang's all here - Sakshi

జొకోవిచ్, నాదల్, ఫెడరర్, ముర్రే సై అంటే సై

నేటి నుంచి యూఎస్‌ ఓపెన్‌

రాత్రి గం. 8.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1, సెలెక్ట్‌–2 చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం  

న్యూయార్క్‌: ఈ ఏడాది ‘బిగ్‌ ఫోర్‌’తో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ రసవత్తరం కానుంది. గాయంతో చాన్నాళ్లుగా ఆటకు దూరమైన మాజీ చాంపియన్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) పునరాగమనంతో పాటు ఈ ఏడాది ‘గ్రాండ్‌’ చాంపియన్లు ఫెడరర్‌ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌), నాదల్‌ (ఫ్రెంచ్‌), జొకోవిచ్‌ (వింబుల్డన్‌) బరిలోకి దిగనుండటంతో యూఎస్‌ ఓపెన్‌లో హోరాహోరీకి రంగం సిద్ధమైంది. టాప్‌ స్టార్లంతా ఆడుతున్న సీజన్‌ చివరి గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీకి నేడు తెరలేవనుంది. భారత్‌ నుంచి యూకీ బాంబ్రీ పురుషుల సింగిల్స్‌లో... రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరణ్‌ డబుల్స్‌లో దిగుతున్నారు.

‘24’ కోసం సెరెనా...
మహిళల సింగిల్స్‌ బరిలో ‘అమెరికా నల్లకలువ’ సెరెనా విలియమ్స్‌ను మరో రికార్డు ఊరిస్తోంది. 23 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల చాంపియన్‌ సెరెనా ఈసారి విజేతగా నిలిస్తే అత్యధిక సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారిణిగా మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిల్స్‌) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది.   

జోరుమీదున్న ‘జోకర్‌’...
వింబుల్డన్‌ చాంపియన్, ఆరో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) న్యూయార్క్‌లోనూ టైటిల్‌పై కన్నేశాడు. గతేడాది భుజం గాయంతో యూఎస్‌కు దూరమైన ‘జోకర్‌’ ఇక్కడ మూడో టైటిల్‌ ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నాడు. 2011, 2015లలో విజేతగా నిలిచిన జొకో ఐదుసార్లు రన్నరప్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల సిన్సినాటి ఓపెన్‌ ఫైనల్లో ఫెడరర్‌పై టైటిల్‌ గెలిచిన జొకోవిచ్‌ మొత్తం తొమ్మిది వేర్వేరు మాస్టర్స్‌ టైటిల్స్‌ నెగ్గిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. జోరు మీదున్న ఈ సెర్బియన్‌ స్టార్‌ తన ఫామ్‌ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్‌ చాంపియన్‌ నాదల్‌ (స్పెయిన్‌), రెండో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top