శ్రీలంక టార్గెట్ 268 | Sakshi
Sakshi News home page

శ్రీలంక టార్గెట్ 268

Published Tue, Feb 9 2016 12:10 PM

శ్రీలంక టార్గెట్ 268

మిర్పూర్: అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ సెమీఫైనల్లో శ్రీలంకకు భారత్ 268 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన యువభారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. అనమోల్ ప్రీత్ సింగ్(72), సర్ఫరాజ్ ఖాన్(59) అర్ధసెంచరీలతో రాణించారు. 27 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు. మూడో వికెట్ కు 96 పరుగులు జోడించారు.

వాషింగ్టన్ సుందర్(43)తో కలిసి నాలుగో వికెట్ కు అనమోల్ ప్రీత్ 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్మాన్ జాఫర్ 29, లోమరొర్ 11, దాగర్ 17, ఆర్ పంత్ 14 పరుగులు చేశారు. లంక బౌలర్లలో ఫెర్నాండొ 4 వికెట్లు పడగొట్టాడు. కుమార, నిమేశ్ రెండేసి వికెట్లు తీశారు.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement