మలింగా తర్వాత ఉమేశ్‌..!

Umesh Has Second Bowler conceding Seventy Plus Runs in an Odi Innigs Most Times - Sakshi

విశాఖపట్నం: వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ డబ్బైకి పైగా పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్ల పాటు బౌలింగ్‌ వేసిన ఉమేశ్‌ యాదవ్‌ వికెట్‌ మాత్రమే తీసి 78 పరుగుల్ని సమర్పించుకున్నాడు. ఫలితంగా వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిసార్లు 70కి పైగా పరుగులిచ్చిన ఆటగాళ్ల జాబితాలో ఉమేశ్‌ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఇక‍్కడ శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగా తొలి స్థానంలో ఉండగా, ఉమేశ్‌ రెండో స్థానంలో నిలిచాడు. మలింగా 17 సార్లు  డబ్భైకి పైగా పరుగుల్ని ఇవ్వగా, ఉమేశ్‌ 12సార్లు డబ్భై అంతకంటే పరుగుల్ని సమర్పించుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషిద్‌(11) మూడో  స్థానంలో ఉన్నాడు.

షై హోప్‌ సరికొత్త రికార్డు

విండీస్‌ ఆటగాడు షై హోప్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. లక్ష్య ఛేదనలో భాగంగా టైగా ముగిసిన మ్యాచ్‌ల్లో అజేయంగా అత్యధిక వ్యక్తిపరుగులు సాధించిన జాబితాలో షై హోప్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ సయ్యిద్‌ అన్వర్‌(103 నాటౌట్‌) ఉన్న రికార్డును హోప్‌ బ్రేక్‌ చేశాడు. 1995లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో అన్వర్‌ అజేయంగా శతకం సాధించగా, ఆ మ్యాచ్‌ టైగా ముగిసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top