ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా జట్టు
లక్నో: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా జట్టు 37–34 తేడాతో యూపీ యోధను ఓడించింది. యు ముంబా నుంచి రిశాంక్ దేవడిగ 14 రైడ్ పాయింట్లతో కీలకంగా నిలిచాడు. యూపీలో షబీర్ 13 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. ప్రథమార్ధం ముగిసేసరికి యోధ జట్టు 15–12తో ఆధిక్యంలో నిలిచింది. ఇదే జోరును చివరి ఏడు నిమిషాల వరకు కూడా కొనసాగించిన యూపీ జట్టు 31–28తో పైచేయి సాధించింది.
అయితే ఈ సమయంలో యు ముంబా అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా ఏడు పాయింట్లు సాధించి యోధకు షాక్ ఇచ్చింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్‌పాంథర్స్ 30–28 తేడాతో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్, యు ముంబాతో... యూపీ యోధ, హర్యానా స్టీలర్స్‌తో తలపడతాయి.