తిరుమలగిరి కేవీదే హవా | Tirumalagiri k v school top | Sakshi
Sakshi News home page

తిరుమలగిరి కేవీదే హవా

Aug 10 2013 1:21 AM | Updated on Sep 1 2017 9:45 PM

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) క్లస్టర్ స్థాయి క్రీడల్లో తిరుమలగిరి కేవీ స్కూల్ క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల బొల్లారం, తిరుమలగిరి, హకీంపేట్ కేవీఎస్ క్లస్టర్ క్రీడలు జరిగాయి.

 ఎల్బీస్టేడియం, న్యూస్‌లైన్: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) క్లస్టర్ స్థాయి క్రీడల్లో తిరుమలగిరి కేవీ స్కూల్ క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల బొల్లారం, తిరుమలగిరి, హకీంపేట్ కేవీఎస్ క్లస్టర్ క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో తిరుమలగిరి కేవీ జట్టు అండర్-19 బాలుర హాకీ, ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ టైటిల్స్‌ను గెలుచుకుంది. అండర్-19 బాలికల విభాగం కబడ్డీ టైటిల్‌ను గెలుచుకోగా, త్రోబాల్‌లో రన్నరప్‌గా నిలిచింది.
 
 అండర్-19 బాలుర జట్టు క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ టైటిల్స్‌ను దక్కించుకున్నాయి. అండర్-14  బాలికల ఖోఖో టైటిల్‌ను గెలుచుకోగా, అండర్-14 బాలుర జట్టు రన్నరప్‌గా నిలిచింది. అండర్-16 బాలుర క్రికెట్ జట్టు టైటిల్‌ను గెలిచింది. పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణి, క్రీడాకారులను తిరుమలగిరి కేవీ స్కూల్ ప్రిన్సిపల్ వి.మృదుల అభినందించారు. క్రీడాకారుల విజయాన్ని కృషి చేసిన పీఈటీలు రమేష్, వీరేంద్ర సింగ్, జి.బి.పద్మారావులపై ప్రశంసలు కురిపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement