సచిన్‌ కు మరపురాని రోజు | This day that year: Sachin Tendulkar makes Test debut for India | Sakshi
Sakshi News home page

సచిన్‌ కు మరపురాని రోజు

Nov 15 2016 2:18 PM | Updated on Sep 4 2017 8:10 PM

సచిన్‌ కు మరపురాని రోజు

సచిన్‌ కు మరపురాని రోజు

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ క్రీడాజీవితంలో ఈరోజు మరపురాని జ్ఞాపకం.

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ క్రీడాజీవితంలో ఈరోజు మరపురాని జ్ఞాపకం. 1989 నవంబర్‌ 15న ‘లిటిల్‌ మాస్టర్‌’  టెస్టు కెరీర్‌ ప్రారంభమైంది. కరాచీ నేషనల్‌ స్టేడియంలో పాకిస్థాన్‌ తో జరిగిన టెస్టు మ్యాచ్‌ లో సచిన్‌ అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్‌ లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌ దిగిన ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’  15 పరుగులు చేసి వకార్‌ యూనిస్‌ బౌలింగ్‌ లో అవుటయ్యాడు. వకార్‌ యూనిస్‌ కూడా ఇదే మొదటి టెస్టు మ్యాచ్‌ కావడం విశేషం. భారత ఫాస్ట్‌ బౌలర్‌ సలీల్‌ అంకోల, పాక్‌ ప్లేయర్‌ షాహిద్‌ సయీద్‌ కూడా ఇదే మ్యాచ్‌ తో టెస్టుల్లో అరంగ్రేటం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement