breaking news
Salil Ankola
-
అతడు టీమిండియాకు ఆడనే లేదా?.. నేను సెలక్టర్‌నే.. నువ్వు చైర్మన్‌వి కదా!
జలజ్ సక్సేనా (Jalaj Saxena).. దేశవాళీ క్రికెట్లో అతడొక దిగ్గజం. రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో ఇప్పటి వరకు ఏడు వేలకు పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. అంతేకాదు.. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఖాతాలో 484 పైగా వికెట్లు కూడా ఉన్నాయి.టీమిండియాకు ఆడే అవకాశమే రాలేదుటీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev), మదన్ లాల్, రవీంద్ర జడేజా తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఈ మేరకు భారీగా పరుగులు రాబట్టడంతో పాటు.. వికెట్లు తీసిన ఘనత జలజ్ సక్సేనాదే. అయితే, 38 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్ వెటరన్ ప్లేయర్‌కు టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం మాత్రం ఇంత వరకు రాలేదు.కేరళ టు మహారాష్ట్రఇదిలా ఉంటే.. దేశీ క్రికెట్లో సుదీర్ఘ కాలం పాటు కేరళకు ప్రాతినిథ్యం వహించిన జలజ్ సక్సేనా.. తాజా రంజీ సీజన్లో మహారాష్ట్రకు మారాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా మహారాష్ట్ర బుధవారం కేరళతో మ్యాచ్ మొదలుపెట్టింది.తిరునంతపురం వేదికగా టాస్ ఓడిన మహారాష్ట్ర.. కేరళ జట్టు ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, కేరళ బౌలర్ల ధాటికి మహారాష్ట్ర టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ డకౌట్ అయ్యారు.హాఫ్ సెంచరీ మిస్.. అయినా భేష్కెప్టెన్ అంకిత్ బవానే కూడా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (91) నెమ్మదిగా క్రీజులో నిలదొక్కుకోగా.. ఏడో స్థానంలో వచ్చిన జలజ్ సక్సేనా కూడా ఆకట్టుకున్నాడు. మొత్తంగా 106 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 49 పరుగులు చేశాడు.ఒక్కసారి కూడా ఆడలేదంటే ఆశ్చర్యమేఈ క్రమంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న టీమిండియా మాజీ సెలక్టర్లు సలీల్ అంకోలా, చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జలజ్ సక్సేనాను ఉద్దేశించి..‘‘సక్సేనా టీమిండియాకు ఒక్కసారి కూడా ఆడలేదంటే ఆశ్చర్యంగా ఉంది’’ అని సలీల్ అన్నాడు.నువ్వు చైర్మన్‌వి కూడానూఇందుకు బదులిస్తూ.. ‘‘సలీల్.. నువ్వు.. ఆశ్చర్యకరం అనే మాటను ఉపయోగించావు. అయితే, నీకో విషయం చెప్పాలి. మన ఇద్దరం మాజీ సెలక్టర్లమే’’ అని చేతన్ శర్మ నవ్వులు చిందించాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘నువ్వు చైర్మన్‌వి కూడానూ’’ అంటూ చేతన్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు సలీల్.దీంతో.. ‘‘నిజమే.. వేళ్లన్నీ మన వైపే చూపించేవి’’ అని చేతన్ శర్మ కవర్ చేశాడు. ఏదేమైనా ప్రతిభ ఉన్న జలజ్ సక్సేనాకు అంతర్జాతీయ క్రికెట్లో కనీసం అరంగేట్రం చేసే అవకాశం రాకపోవడం పట్ల నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నవ్వుతూనే అయినా తప్పును ఒప్పుకొన్నారంటూ మాజీ సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు.239 పరుగులకు ఆలౌట్ఇదిలా ఉంటే.. కేరళతో మ్యాచ్‌లో మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 239 పరుగులకు ఆలౌట్ అయింది. రుతు, జలజ్‌తో పాటు విక్కీ ఓస్త్వాల్ (38), రామకృష్ణ ఘోష్ (31) రాణించడంతో ఈ మేర నామమాత్రపు స్కోరు సాధ్యమైంది. కేరళ బౌలర్లలో నిధీశ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నెడుమంకులి బాసిల్ మూడు, ఈడెన్ ఆపిల్, అంకిత్ శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: టీమిండియా సెలక్టర్లకు ఇషాన్ స్ట్రాంగ్ కౌంటర్.. అంతలోనే...When they showed Jalaj Saxena's domestic stats one commentator said he has such great stats but it's surprising that he hasn't played for India and the other commentator replied"Surprisingly" both of us were the selectors and you were the chairman. pic.twitter.com/QvtzZEbWkG https://t.co/q8kHY6rkkv— Aditya Soni (@imAdsoni) October 15, 2025 -
గుండె పగిలింది: టీమిండియా మాజీ క్రికెటర్ భావోద్వేగం
టీమిండియా మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి తల్లి మాలా అశోక్ అంకోలా(77) అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. పుణెలోని తన ఫ్లాట్‌లో గొంతు కోసి ఉన్న స్థితిలో శవమై కనిపించారు.మానసిక సమస్యలతో సతమతంఈ నేపథ్యంలో ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. అనంతరం డీఎస్పీ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. ‘‘మాలా ఇంట్లో పనిచేసే వ్యక్తి ఫ్లాట్‌కి వచ్చి డోర్ కొట్టగా ఎవరూ తలుపుతీయలేదు. దీంతో సమీపంలో నివసించే బంధువులకు సమాచారం ఇచ్చింది.తలుపు తెరిచి చూడగా మాలా విగతజీవిగా కనిపించారు. ఆమె గొంతు కోసి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ గాయాలు తనకు తాను గానే చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. కాగా మాలా అశోక్ అంకోలా గత కొన్నిరోజులుగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గిల్ ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతో తనకు తానుగానే గాయపరచుకున్నారా అన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. అమ్మా.. హృదయం ముక్కలైందికాగా సలీల్ అంకోలా అంతర్జాతీయ క్రికెట్లో 1989- 1997 మధ్య భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఒక టెస్టు, 20 వన్డేలు ఆడాడు. అనంతరం ఈ ఫాస్ట్‌బౌలర్ పలు హిందీ సినిమాలతో పాటు టీవీ షోలలో నటించాడు. కాగా తల్లి మరణాన్ని ధ్రువీకరిస్తూ.. ‘అమ్మా’ అంటూ గుండె పగిలినట్లుగా ఉన్న ఎమోజీతో ఆమె ఫొటోను సలీల్ అంకోలా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Salil Ankola (@salilankola) -
సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా అజయ్ రాత్రా
భారత పురుషుల క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ అజయ్ రాత్రా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) మంగళవారం (సెప్టెంబర్ 3) ప్రకటించింది. మాజీ సభ్యుడు సలీల్ అంకోలా స్థానాన్ని రాత్రా భర్తీ చేస్తాడు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, అంకోలా ఇద్దరూ ఒకే జోన్‌కు (వెస్ట్) చెందిన వారు కావడంతో అంకోలా సెలెక్షన్ కమిటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. రాత్రా నార్త్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, శ్రీథరన్ శరత్ సభ్యులుగా ఉన్నారు. తాజాగా రాత్రా వీరి సరసన చేరాడు. 2002లో టీమిండియా తరఫున 6 టెస్ట్‌లు, 12 వన్డేలు ఆడిన రాత్రా దేశవాలీ క్రికెట్లో అసోం, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. అతను 2023 దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అజయ్ రాత్రా టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున ఓ సెంచరీ చేశాడు. -
దిగ్గజ క్రికెటర్‌తో పాటే అరంగేట్రం.. క్రికెట్‌పై అసూయ పెంచుకొని
టీమిండియా క్రికెట్ మనకు ఎందరో ఫాస్ట్ బౌలర్లను పరిచయం చేసింది. 1970, 80వ దశకంలో కపిల్ దేవ్, బిషన్‌సింగ్ బేడీ లాంటి వాళ్లు.. 90వ దశకంలో జల్ జవగల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, అజిత్ అగార్కర్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేలు ఉంటారు. ఇక 20వ దశకంలో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్.. ఈ తరంలో బుమ్రా, భువనేశ్వర్, మహ్మద్ షమీ ఇలా చెప్పుకుంటే పోతే ఎందరో క్రికెటర్లు వస్తారు. అయితే మనం పైన చెప్పుకున్న వాళ్లంతా క్రికెట్లో ఒక్కో దశలో వెలిగారు.. వెలుగుతున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్యలో మనకు తెలియకుండానే చాలా మంది బౌలర్లు వచ్చారు.. కనుమరుగయ్యారు. అలాంటి కోవకే చెందిన వాడే.. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోలా. సలీల్ అంకోలా.. ముంబై నుంచి వచ్చిన టాప్ పేస్ బౌలర్. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అరంగేట్రం చేసిన 1989వ సంవత్సరంలోనే సలీల్ అంకోలా కూడా టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే ఎంత వేగంగా వచ్చాడో.. అంతే వేగంగా కనుమరుగయ్యాడు. టీమిండియా తరపున ఒక టెస్టు, 20 వన్డేలు మాత్రమే ఆడిన సలీల్ అంకోలా 1997లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సలీల్ అంకోలా క్రికెట్‌పై తనకు అసూయ ఎలా ఏర్పడిందన్నది వివరించాడు. ''1989లోనే దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటే అరంగేట్రం చేసినప్పటికి పెద్దగా అవకాశాలు రాలేదు. బహుశా నా బౌలింగ్ నచ్చకనో మరేంటో తెలియదు. అయితే నాకు వచ్చిన అవకాశాలను కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయాను. ఆ తర్వాత ఎనిమిదేళ్ల కెరీర్లో ఎన్నోసార్లు జట్టులోకి రావడం వెళ్లడం జరిగింది. టీమిండియాలో చోటు దక్కకపోతే.. టీమిండియా-ఏకి ఎంపికయ్యేవాడిని. ఎక్కడికి వెళ్లినా నా పని మాత్రం ఒకటే ఉండేది. మైదానంలో కంటే డ్రింక్స్ బాయ్‌గానే ఎక్కువగా సేవలందించాను. ఒక దశలో క్రికెట్‌పై విపరీతమైన అసూయ పుట్టుకొచ్చింది. అందుకే ఉన్నపళంగా క్రికెట్‌కు రిటైర్మెంట్కు ప్రకటించాను. 2001 తర్వాత క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాను. ఆటకు మాత్రమే దూరమవ్వాలనుకున్న నేను.. తెలియకుండానే చేసిన తప్పు వల్ల కొన్నేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటానని అప్పుడనుకోలేదు. అప్పట్లో మ్యాచ్‌లను టెలికాస్ట్ చేసిన సోనీ చానెల్ నుంచి కామెంటేటర్‌గా విధులు నిర్వర్తించాలంటూ నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. అయితే దానిని నేను తిరస్కరించాను. కానీ ఎందుకు చేశానో తెలియదు. ఇప్పుడు అది తలుచుకుంటే ఎంత మూర్కత్వమైన నిర్ణయం తీసుకున్నానా అని బాధపడాల్సి వచ్చింది. ''అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 2010లో అంకోలా వ్యక్తిగత జీవితం తలకిందులైంది. మొదటి భార్యతో విడాకుల అనంతరం సలీల్ అంకోలా మద్యానికి బానిసయ్యాడు. మనుషులను మరిచిపోయేంతగా తాగుతుండేవాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన రెండో భార్య సలీల్‌ను రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించింది. దాదాపు 10 ఏళ్ల పాటు రీహాబిలిటేషన్‌లో ఉన్న సలీల్ అంకోలా మళ్లీ మాములు మనిషిగా తిరిగొచ్చాడు. కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాడు. ఈ మధ్యనే ఏ క్రికెట్‌పై అసూయపడ్డాడో దానిలోనే మళ్లీ అడుగుపెట్టాడు. గతేడాది ముంబై క్రికెట్‌కు చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికయ్యి తన సేవలందిస్తున్నాడు. చదవండి: Stuart MacGill: 'పాయింట్ బ్లాక్‌లో గన్.. నగ్నంగా నిలబెట్టి దారుణంగా కొట్టారు' Katherine Brunt: 'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గుడ్‌బై -
సచిన్ కు మరపురాని రోజు
-
సచిన్ కు మరపురాని రోజు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రీడాజీవితంలో ఈరోజు మరపురాని జ్ఞాపకం. 1989 నవంబర్ 15న ‘లిటిల్ మాస్టర్’ టెస్టు కెరీర్ ప్రారంభమైంది. కరాచీ నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో సచిన్ అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్ లో ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగిన ‘మాస్టర్ బ్లాస్టర్’ 15 పరుగులు చేసి వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ యూనిస్ కూడా ఇదే మొదటి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. భారత ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోల, పాక్ ప్లేయర్ షాహిద్ సయీద్ కూడా ఇదే మ్యాచ్ తో టెస్టుల్లో అరంగ్రేటం చేశారు. 16 ఏళ్ల 205 రోజుల చిన్న వయసులో సచిన్ టెస్టు కెరీర్ ప్రారంభించాడు. తన విశేష ప్రతిభతో టెండూల్కర్ తర్వాత తిరుగులేని క్రికెటర్ గా ఎదిగాడు. భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేశాడు. 24 ఏళ్ల పాటు క్రికెట్ లో కొనసాగిన సచిన్ ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. 200 టెస్టులు ఆడి 53.78 సగటుతో 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు, 68 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో సచిన్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 248 నాటౌట్. 46 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ పేరిటే ఉంది. అత్యుత్తమ ఆటతీరు, ఒద్దికైన వ్యక్తిత్వంతో సచిన్ ‘క్రికెట్ దేవుడి’గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. -
బాలీవుడ్ నటుడు, క్రికెటర్ మాజీ భార్య ఆత్మహత్య
క్రికెటర్, బాలీవుడ్ నటుడు సలీల్ అంకోలా మాజీ భార్య పూణేలోని తన నివాసంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పూణేలోని సాలిస్బరీ పార్క్ లోని గీతా సొసైటీ అపార్ట్ మెంట్ లోని నివాసం ఉంటున్న పరిణిత అంకోలా ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2011లో సలీల్ అంకోలా నుంచి విడిపోయిన పరిణితకు కూతురు, కుమారుడు ఉన్నారు. గత కొద్దికాలంగా.పరిణిత తల్లితో కలిసి ఉంటుంది. తన తల్లి మధ్యాహ్నం బయటకు వెళ్లిన సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించిదని పోలీసులు తెలిపారు. రాత్రి 8 గంటల సమయంలో పరిణిత తల్లి తిరిగి రాగా .. ఇంటి తలుపులు మూసి ఉండటం గమనించిందని, ఎంత ప్రయత్నించానా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె ఇరుగు పొరుగు సహాయంతో లోనికి వెళ్లగా.. పరిణితి ఫ్యాన్ కు వేళాడుతూ కనిపించిందని, వెంటనే సమీపంలోని సస్సాన్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్లు ధృవీకరించారని పోలీసులు వెల్లడించారు. పరిణిత గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, ఆత్మహత్యకు కారణాలేవి ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు.


