బాలీవుడ్ నటుడు, క్రికెటర్ మాజీ భార్య ఆత్మహత్య | Salil Ankola’s ex-wife found dead in Pune | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ నటుడు, క్రికెటర్ మాజీ భార్య ఆత్మహత్య

Dec 23 2013 2:49 PM | Updated on Nov 6 2018 7:53 PM

క్రికెటర్, బాలీవుడ్ నటుడు సలీల్ అంకోలా మాజీ భార్య పూణేలోని తన నివాసంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది.

క్రికెటర్, బాలీవుడ్ నటుడు సలీల్ అంకోలా మాజీ భార్య పూణేలోని తన నివాసంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పూణేలోని సాలిస్బరీ పార్క్ లోని గీతా సొసైటీ అపార్ట్ మెంట్ లోని నివాసం ఉంటున్న పరిణిత అంకోలా ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2011లో సలీల్ అంకోలా నుంచి విడిపోయిన పరిణితకు కూతురు, కుమారుడు ఉన్నారు. 
 
గత కొద్దికాలంగా.పరిణిత తల్లితో కలిసి ఉంటుంది. తన తల్లి మధ్యాహ్నం బయటకు వెళ్లిన సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించిదని పోలీసులు తెలిపారు. రాత్రి 8 గంటల సమయంలో పరిణిత తల్లి తిరిగి రాగా .. ఇంటి తలుపులు మూసి ఉండటం గమనించిందని, ఎంత ప్రయత్నించానా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె ఇరుగు పొరుగు సహాయంతో లోనికి వెళ్లగా.. పరిణితి ఫ్యాన్ కు వేళాడుతూ కనిపించిందని, వెంటనే సమీపంలోని సస్సాన్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్లు ధృవీకరించారని పోలీసులు వెల్లడించారు. 
 
పరిణిత గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, ఆత్మహత్యకు కారణాలేవి ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement