మెయిన్ ‘డ్రా’కు చేరువలో సోమ్‌దేవ్ | The Main 'draw' to close somdev | Sakshi
Sakshi News home page

మెయిన్ ‘డ్రా’కు చేరువలో సోమ్‌దేవ్

Aug 24 2013 1:48 AM | Updated on Sep 1 2017 10:03 PM

మెయిన్ ‘డ్రా’కు చేరువలో సోమ్‌దేవ్

మెయిన్ ‘డ్రా’కు చేరువలో సోమ్‌దేవ్

మరో విజయం సాధిస్తే భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. గురువారం జరిగిన క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో సోమ్‌దేవ్ 7-6 (7/4), 2-6, 6-2తో రాబీ జినెప్రి (అమెరికా)పై విజయం సాధించాడు.

న్యూయార్క్: మరో విజయం సాధిస్తే భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. గురువారం జరిగిన క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో సోమ్‌దేవ్ 7-6 (7/4), 2-6, 6-2తో రాబీ జినెప్రి (అమెరికా)పై విజయం సాధించాడు.

రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గిన సోమ్‌దేవ్‌కు రెండో సెట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా ఫలితం లేకపోయింది. అయితే నిర్ణాయక మూడో సెట్‌లో సోమ్‌దేవ్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. జేమ్స్ వార్డ్ (బ్రిటన్)తో జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో సోమ్‌దేవ్ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందుతాడు. యూఎస్ ఓపెన్ ప్రధాన టోర్నమెంట్ ఈనెల 26న ప్రారంభమవుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement