తెలంగాణ జట్లకు టైటిల్స్‌

telangana teams got titles in sgfi games - Sakshi

జాతీయ హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌

మహబూబ్‌నగర్‌ : భారత స్కూల్‌గేమ్స్‌ సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌ఐ) జాతీయ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అండర్‌–17 జట్లు చెలరేగాయి. బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. బుధవారం జరిగిన బాలుర ఫైనల్లో తెలంగాణ 17–13తో ఢిల్లీపై విజయం సాధించింది. బాలికల తుది పోరులోనూ తెలంగాణ 10–4తో ఢిల్లీని చిత్తుగా ఓడించింది. పోటీల అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా టోర్నమెంట్‌ల నిర్వహణకు నిధుల కొరత ఉందని, భవిష్యత్‌లో జరిగే పోటీలకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా తనవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న తెలంగాణ జట్లను అభినందించారు.

 

Back to Top