తెలంగాణకు కాంస్యం | telangana team got bronze medal in national soft ball championship | Sakshi
Sakshi News home page

తెలంగాణకు కాంస్యం

Dec 30 2016 10:32 AM | Updated on Oct 22 2018 8:11 PM

తెలంగాణకు కాంస్యం - Sakshi

తెలంగాణకు కాంస్యం

జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ టోర్నీలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించారు.

సాక్షి, హైదరాబాద్: జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ టోర్నీలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించారు. గురువారం జరిగిన అండర్-10 బాలికల మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 9-1తో మహారాష్ట్ర జట్టుపై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మధ్యప్రదేశ్ జట్టు టైటిల్‌ను దక్కించుకోగా... ఆంధ్రప్రదేశ్ రన్నరప్‌గా నిలిచింది.

 

బాలుర విభాగంలోనూ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ జట్లు తొలి రెండు స్థానాలను సంపాదించుకోగా... మహారాష్ట్ర మూడోస్థానాన్ని దక్కించుకుంది. అండర్-12 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ జట్టు మొదటి మూడు స్థానాలను సంపాదించారుు. బాలికల విభాగంలో మధ్యప్రదేశ్ టైటిల్‌ను దక్కించుకోగా... ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ జట్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement