రన్నరప్‌ తెలంగాణ | telangana as runner up in softball | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ తెలంగాణ

Oct 9 2017 10:17 AM | Updated on Oct 22 2018 8:11 PM

telangana as runner up in softball - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ సీనియర్‌ జాతీయ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ జట్లు ఆకట్టుకున్నాయి. కేరళలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో రెండో స్థానంలో నిలిచి రన్నరప్‌ ట్రోఫీలను సాధించాయి. ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో కేరళ జట్టు 7–5తో తెలంగాణపై విజయం సాధించింది.

ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు మూడో స్థానం లభించింది. మహిళల టైటిల్‌ పోరులో కేరళ 6–2తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. మూడో స్థానాన్ని గోవా జట్టు కైవసం చేసుకుంది.  

Advertisement
 
Advertisement
Advertisement