
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. బెంగళూరులో జరిగిన ఈ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచి రెండు టైటిళ్లను దక్కించుకున్నాయి.
సోమవారం జరిగిన బాలుర టైటిల్ పోరులో కర్ణాటక జట్టు 25–21, 25–23తో తెలంగాణపై గెలుపొందింది. బాలికల తుదిపోరులోనూ కర్ణాటక 25–20, 25–22తో తెలంగాణను ఓడించింది. బాలుర జట్టు తరఫున బి. వేణుగోపాల్, బాలికల జట్టులో ఆర్. మౌనిక రాథోడ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరికీ ‘బెస్ట్ అటాకర్’ అవార్డులు దక్కాయి.