తెలంగాణ శుభారంభం  | Telangana Beats Bengal In Football Tourney Opener | Sakshi
Sakshi News home page

తెలంగాణ శుభారంభం 

Mar 8 2020 10:11 AM | Updated on Mar 8 2020 10:11 AM

Telangana Beats Bengal In Football Tourney Opener - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెటరన్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో శనివారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో తెలంగాణ ఎలెవన్‌ 3–1తో వెస్ట్‌ బెంగాల్‌ జట్టుపై గెలుపొందింది. తెలంగాణ ప్లేయర్లు ఖలీల్‌ రహ్మాన్‌ (10వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... శ్రీనివాస్‌ (25వ నిమిషంలో) ఒక గోల్‌ సాధించాడు. బెంగాల్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను సుభాశ్‌ (27వ నిమిషంలో) వేశాడు. ఈ మ్యాచ్‌లో తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి, మాజీ భారత ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ జి.పి ఫాల్గుణ తెలంగాణ జట్టు తరఫున బరిలో దిగారు. 

Advertisement
 
Advertisement
Advertisement