ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా: ధోనీ(34) అవుట్ | team india lose 6th wicket at 137 runs | Sakshi
Sakshi News home page

ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా: ధోనీ(34) అవుట్

Jan 20 2015 11:24 AM | Updated on Sep 2 2017 7:59 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 137 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది.

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా  137 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. 35 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసిన టీమిండియా అనంతరం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34) వికెట్ ను కోల్పోయింది. .ఓ దశలో వరుస వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టువర్ట్ బిన్నీలు మరమ్మత్తులు చేశారు. అంతకుముందు శిఖర్ ధావన్(1),  అజ్యింకా రహానే(33),  విరాట్ కోహ్లీ(4),  సురేష్ రైనా(1), అంబటి రాయుడు (23) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement