25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(89/5) | team india get 89 runs in 25 overs | Sakshi
Sakshi News home page

25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(89/5)

Jan 20 2015 10:43 AM | Updated on Sep 2 2017 7:59 PM

ముక్కోణపు సిరీస్ లో టీమిండియా జట్టు మరోసారి పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది.

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో టీమిండియా జట్టు తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 25 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 89 పరుగులు మాత్రమే చేసింది. 15 ఓవర్లకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన టీమిండియా అటు తరువాత వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అంబటి రాయుడు (23)పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

 

అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4), సురేష్ రైనా(1) పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా, అండర్ సన్, మహ్మద్ అలీకి ఒక వికెట్ దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement