
ఢాకా: బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ మరో ఘనత సాధించాడు. వన్డేల్లో 6 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనత సాధించిన బంగ్లాదేశ్ తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఏడాది తర్వాత 2008లో తొలి సెంచరీ సాధించాడు.
11 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న తమీమ్ ఇప్పటివరకు 177 మ్యాచ్‌లు ఆడి 35.65 సగటుతో 6010 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 41 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 154. ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 5235 పరుగులతో తమీమ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
అక్కడ అతడే టాప్
వన్డేల్లో ఒక వేదికపై అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కూడా తమీమ్ పేరిట ఉంది. శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో అత్యధిక పరుగులు సాధించాడు. సనత్ జయసూర్య(2514) పేరిట ఉన్న రికార్డును అతడు సవరించాడు.