షాట్‌పుట్‌లో తజీందర్‌ జాతీయ రికార్డు | Tajinder Pal Singh Breaks His Own National Record With 20.92m Effort | Sakshi
Sakshi News home page

షాట్‌పుట్‌లో తజీందర్‌ జాతీయ రికార్డు

Oct 13 2019 5:10 AM | Updated on Oct 13 2019 5:10 AM

Tajinder Pal Singh Breaks His Own National Record With 20.92m Effort - Sakshi

రాంచీ: జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ఛాంపియన్ షిప్ లో తజీందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన పురుషుల షాట్‌పుట్‌ ఈవెంట్‌లో తజీందర్‌ ఇనుప గుండును 20.92 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. 20.75 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఈ నెలాఖర్లో చైనాలో జరిగే ప్రపంచ మిలిటరీ గేమ్స్‌లో పాల్గొనబోతున్న తజీందర్‌ ఆ ఈవెంట్‌లో టోక్యో ఒలింపిక్స్‌ అర్హత ప్రమాణం 21.10 మీటర్లను అందుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇటీవల దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తజీందర్‌ 20.43 మీటర్లతో 18వ స్థానంలో నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement