నైనా జైస్వాల్‌కు సన్మానం | Table Tennis Player Nina Jaiswal felicitated | Sakshi
Sakshi News home page

నైనా జైస్వాల్‌కు సన్మానం

Dec 3 2013 1:50 AM | Updated on Sep 2 2017 1:11 AM

నైనా జైస్వాల్‌కు సన్మానం

నైనా జైస్వాల్‌కు సన్మానం

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకుంటున్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను సోమవారం హైదరాబాద్ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది.

జింఖానా, న్యూస్‌లైన్: అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకుంటున్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను సోమవారం హైదరాబాద్ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. 13 ఏళ్ల నైనా ఇటీవల ఇరాన్‌లో జరిగిన అంతర్జాతీయ క్యాడెట్ అండ్ జూనియర్ టీటీ టోర్నీలో రెండు స్వర్ణాలతో పాటు ఓ కాంస్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా నైనా మాట్లాడుతూ తన విజయాల వెనుక తల్లిదండ్రుల కృషి ఉందని తెలిపింది. ‘ఆడపిల్లలను నేటి సమాజం భారంగా పరిగణిస్తున్న సమయంలో నన్ను అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు.
ఓ మహిళగా సమున్నత స్థాయికి ఎదిగిన మాజీ పోలీస్ అధికారిణి కిరణ్ బేడిని నేను ఆదర్శంగా తీసుకుంటాను’ అని నైనా తెలిపింది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తమ కుమార్తె 15 స్వర్ణ పతకాలు సాధించినట్లు నైనా తండ్రి, హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ కార్యదర్శి అశ్విన్‌కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఎస్‌ఎం. ఆరిఫ్, అర్జున అవార్డు గ్రహీత మీర్ ఖాసిం అలీ, ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నరసింహారావు, ప్రముఖ బాడీ బిల్డర్ మోతేశ్యామ్ అలీ, టైపింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించిన ఖుర్షీద్ హుస్సేన్, హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ అకాడమీ అధ్యక్షుడు సాయిప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement