ఈసారి సాధిస్తాం | Sure this time to get Copa America title | Sakshi
Sakshi News home page

ఈసారి సాధిస్తాం

Jun 10 2015 3:23 AM | Updated on Sep 3 2017 3:28 AM

ఈసారి సాధిస్తాం

ఈసారి సాధిస్తాం

రెండు దశాబ్దాలుగా ఊరిస్తున్న ‘కోపా అమెరికా’ కప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను ఈసారి సాధిస్తామని...

‘కోపా అమెరికా’పై మెస్సీ
లా సెరినా (చిలీ):
రెండు దశాబ్దాలుగా ఊరిస్తున్న ‘కోపా అమెరికా’ కప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను ఈసారి సాధిస్తామని అర్జెంటీనా జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగే ఈ టోర్నీ గురువారం చిలీలో ప్రారంభమవుతుంది. 1993లో చివరిసారి అర్జెంటీనా ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా బార్సిలోనా క్లబ్ జట్టుకు మెస్సీ ఎన్నో గొప్ప విజయాలు సాధించినా జాతీయ జట్టుకు మాత్రం అదే స్థాయిలో విజయాలు అందించలేకపోయాడు. గతేడాది ప్రపంచ కప్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు రన్నరప్‌గా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement