అతను మోసగాడు కాదు: గంగూలీ | Steve Smith is a Fantastic Player, Dont Think He Cheated, Ganguly | Sakshi
Sakshi News home page

అతను మోసగాడు కాదు: గంగూలీ

Apr 5 2018 12:00 PM | Updated on Apr 5 2018 12:00 PM

Steve Smith is a Fantastic Player, Dont Think He Cheated, Ganguly - Sakshi

ముంబై: బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌కు టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ మద్దతుగా నిలిచాడు. స్మిత్‌ ఒక అద్భుతమైన క్రికెటర్‌ అని పేర్కొన్న గంగూలీ.. అతన్ని మోసగాడిగా చూడొద్దంటూ హితవు పలికాడు.

‘స్మిత్‌ పట్ల నాకు సానుభూతి ఉంది. ఎందుకంటే అతనొక అసాధారణ క్రికెటర్‌. అతన్ని మోసగాడిగా చూడొద్దు. ఆసీస్‌ తిరిగి బరిలోకి దిగి సత్తాచాటుతాడు. అతను చీట్‌ చేశాడంటే నేను నమ్మడం లేదు. అతని చేసింది మోసం అనడం సరికాదు' అని గంగూలీ తెలిపాడు. 

Advertisement
 
Advertisement
Advertisement