
రాష్ట్ర ర్యాంకింగ్ టీటీ: నైనా ‘డబుల్’
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి నైనా జైస్వాల్ (హైదరాబాద్) సత్తా చాటింది
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి నైనా జైస్వాల్ (హైదరాబాద్) సత్తా చాటింది. ఆమె సబ్ జూనియర్, జూనియర్ సింగిల్స్ విభాగాలలో విజేతగా నిలిచింది. కృష్ణా జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని డీఆర్‌ఆర్‌ఎంసీ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు ఇటీవల ముగిశాయి. సబ్ జూనియర్ సింగిల్స్ ఫైనల్లో నైనా 4-1 స్కోరుతో కె.వి.వి.వైశాలీ (అనంతపురం)పై విజయం సాధించింది. జూనియర్ సింగిల్స్ ఫైనల్లోనూ నైనా 4-2తో కె.వి.వి.వైశాలీపై గెలిచింది. నైనా సోదరుడు అగస్త్య జైస్వాల్ ఈటోర్నీలో మినీ క్యాడెట్ టైటిల్‌ను గెలిచాడు.