దక్షిణాఫ్రికా విజయలక్ష్యం166 | srilanka set target of 166 for south africa | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా విజయలక్ష్యం166

Mar 22 2014 4:59 PM | Updated on Nov 9 2018 6:43 PM

ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫిక్రాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫిక్రాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన లంకేయులు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు.  ఓపెనర్ దిల్షాన్(0) పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరి ఆదిలోనే లంకను నిరాశపరిచాడు. మరో ఓపెనర్ పెరీరా మాత్రం ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో దూకుడుగా ఆడిన పెరీరా 61 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం జయవర్ధనే(9), సంగక్కారా(14) పరుగులు మాత్రమే చేసి లంకను మరోసారి కష్టాల్లోకి నెట్టారు. ఈ క్రమంలో క్రీజ్ లోకి మాథ్యూస్ (43) పరుగులు చేయడంతో లంకేయులు తిరిగి కోలుకున్నారు.

 

దీంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తహీర్ మూడు వికెట్లు తీయగా,మోర్కెల్ , స్టెయిన్ లకు తలో రెండు వికెట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement