క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ ఓటమి | Srikanth loses to Chen Long at Malaysia Open | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ ఓటమి

Apr 5 2019 5:20 PM | Updated on Apr 5 2019 5:20 PM

Srikanth loses to Chen Long at Malaysia Open - Sakshi

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్‌ శ్రీకాంత్‌ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 18-21, 19-21 తేడాతో  ఒలింపిక్‌ చాంపియన్, నాలుగో సీడ్‌ చెన్‌ లాంగ్‌ (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు.

ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో శ్రీకాంత్‌ ఒత్తిడిని అధిగమించలేక ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్‌ను మూడు పాయింట్ల తేడాతో కోల్పోయిన శ్రీకాంత్‌.. రెండో గేమ్‌ను రెండు పాయింట్ల తేడాతో వదులుకున్నాడు. ఫలితంగా టోర్నీ నుంచి  శ్రీకాంత్‌ నిష్క్రమించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement