శ్రీజకు ఖాయమైన పతకం | srija won medal | Sakshi
Sakshi News home page

శ్రీజకు ఖాయమైన పతకం

May 24 2014 12:13 AM | Updated on Sep 2 2017 7:45 AM

గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ.. యూరప్ పర్యటనలో పతకం ఖాయం చేసుకుంది. శ్

స్లొవేకియా ఓపెన్ టీటీ ఫైనల్లో భారత్
 సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ.. యూరప్ పర్యటనలో పతకం ఖాయం చేసుకుంది. శ్రీజతోపాటు ప్రియదర్శిని దాస్, ఐహికా ముఖర్జీలతో కూడిన భారత జట్టు స్లొవేకియా ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది.
 
  దీంతో టోర్నీలో భారత్ కనీసం రజతం దక్కించుకోనుంది. స్లొవేకియాలోని సెనెక్‌లో జరుగుతున్న ఈ ప్రపంచ స్థాయి జూనియర్ పోటీల్లో టాప్ సీడ్ భారత్ సెమీఫైనల్లో 3-1తో బల్గేరియా-ఉరుగ్వే (మిక్స్‌డ్) జట్టుపై నెగ్గింది. ఈ పోటీలో సింగిల్స్‌లో శ్రీజ 4-11, 11-6, 11-7, 11-7తో మిహెలా దిమోవాను ఓడిం చింది. అంతకుముందు జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత్ 3-0తో స్లొవేకియాపై గెలుపొందింది. స్లొవేకియాపై తొలి గేమ్‌లో ప్రియదర్శిని దాస్ 3-0 తేడాతో మిరియామేను ఓడించగా, రెండో గేమ్‌లో ఐహికా 3-0తో కరోలినాపై, మూడో గేమ్‌లో శ్రీజ 3-0తో అనోవా లూసియాపై గెలుపొందారు.
 

Advertisement
 
Advertisement
Advertisement