breaking news
Global table tennis academy
-
శ్రీజకు ఖాయమైన పతకం
స్లొవేకియా ఓపెన్ టీటీ ఫైనల్లో భారత్ సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ.. యూరప్ పర్యటనలో పతకం ఖాయం చేసుకుంది. శ్రీజతోపాటు ప్రియదర్శిని దాస్, ఐహికా ముఖర్జీలతో కూడిన భారత జట్టు స్లొవేకియా ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో టోర్నీలో భారత్ కనీసం రజతం దక్కించుకోనుంది. స్లొవేకియాలోని సెనెక్‌లో జరుగుతున్న ఈ ప్రపంచ స్థాయి జూనియర్ పోటీల్లో టాప్ సీడ్ భారత్ సెమీఫైనల్లో 3-1తో బల్గేరియా-ఉరుగ్వే (మిక్స్డ్) జట్టుపై నెగ్గింది. ఈ పోటీలో సింగిల్స్‌లో శ్రీజ 4-11, 11-6, 11-7, 11-7తో మిహెలా దిమోవాను ఓడిం చింది. అంతకుముందు జరిగిన క్వార్టర్ఫైనల్లో భారత్ 3-0తో స్లొవేకియాపై గెలుపొందింది. స్లొవేకియాపై తొలి గేమ్‌లో ప్రియదర్శిని దాస్ 3-0 తేడాతో మిరియామేను ఓడించగా, రెండో గేమ్‌లో ఐహికా 3-0తో కరోలినాపై, మూడో గేమ్‌లో శ్రీజ 3-0తో అనోవా లూసియాపై గెలుపొందారు. -
టీటీ శిక్షణకు ‘గ్లోబల్’ క్రీడాకారులు
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఫిడెల్ ఆర్ స్నేహిత్, ఎ.శ్రీజలు భారత టేబుల్ టెన్నిస్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) అనుమతితో లక్నోలో మే 1 నుంచి జూన్ 15 వరకు ఈ శిబిరం జరగనుంది. వీరిద్దరితోపాటు పాల్-స్టాగ్ టీటీ అకాడమీకి చెందిన వి.ఎస్.హరికృష్ణ, నైనా జైస్వాల్ (ఎల్బీ స్టేడియం) కూడా లక్నో శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారు. ఈ మేరకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) సెక్రటరీ జనరల్ ధన్‌రాజ్ చౌదరి నుంచి ఆంధ్రప్రదేశ్ టీటీ సంఘానికి సమాచారమందింది. నైనా జైస్వాల్, శ్రీజలు ఇంతకుముందు కూడా జాతీయ శిక్షణ శిబిరానికి ఎంపిక కాగా, స్నేహిత్, హరికృష్ణలు తొలిసారిగా ఎంపికవడం విశేషం.