టీటీ శిక్షణకు ‘గ్లోబల్’ క్రీడాకారులు | TT Trainning 'global' players | Sakshi
Sakshi News home page

టీటీ శిక్షణకు ‘గ్లోబల్’ క్రీడాకారులు

Apr 23 2014 12:09 AM | Updated on Sep 4 2018 5:07 PM

గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఫిడెల్ ఆర్ స్నేహిత్, ఎ.శ్రీజలు భారత టేబుల్ టెన్నిస్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారు.

సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఫిడెల్ ఆర్ స్నేహిత్, ఎ.శ్రీజలు భారత టేబుల్ టెన్నిస్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) అనుమతితో లక్నోలో మే 1 నుంచి జూన్ 15 వరకు ఈ శిబిరం జరగనుంది.
 
  వీరిద్దరితోపాటు పాల్-స్టాగ్ టీటీ అకాడమీకి చెందిన వి.ఎస్.హరికృష్ణ, నైనా జైస్వాల్ (ఎల్‌బీ స్టేడియం) కూడా లక్నో శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారు. ఈ మేరకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) సెక్రటరీ జనరల్ ధన్‌రాజ్ చౌదరి నుంచి ఆంధ్రప్రదేశ్ టీటీ సంఘానికి సమాచారమందింది. నైనా జైస్వాల్, శ్రీజలు ఇంతకుముందు కూడా జాతీయ శిక్షణ శిబిరానికి ఎంపిక కాగా, స్నేహిత్, హరికృష్ణలు తొలిసారిగా ఎంపికవడం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement