హీరోయిన్‌ శ్రీజ ఆల్బమ్ సాంగ్ లాంచ్ | Srija Kothaga Kothaga Album Song | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ శ్రీజ ఆల్బమ్ సాంగ్ లాంచ్

Apr 5 2026 7:33 PM | Updated on Apr 5 2026 7:33 PM

Srija Kothaga Kothaga Album Song

యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఆల్బమ్ సాంగ్ 'కొత్త కొత్తగా'. తాజాగా ఇది రిలీజైంది. ఇందులో 'దేవగుడి' మూవీ ఫేమ్ హీరో అభినవ్ శౌర్య కూడా నటించారు. రఘురామ్ ఈ పాటకు లిరిక్స్ రాసి సంగీతమందించారు. లిప్సిక పాడారు. ఈ సాంగ్ ఆల్బమ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో తాజాగా జరిగింది.

(ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు: యాంకర్ రష్మి)

మా 'కొత్త కొత్తగా' సాంగ్ లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ డీవై చౌదరికి థ్యాంక్స్ చెబుతున్నా. 'రంగస్థలం'లో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత మరికొన్ని మూవీస్ చేశారు. టీవీ ఛానెల్స్‌లో షోలు కూడా చేశాను. శ్రీజ మ్యూజిక్ ఛానెల్‌లో మేం చేసిన సాంగ్స్ అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఇది చేశాం అని శ్రీజ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ‍జరిగిన దానికి సిగ్గుపడుతున్నా.. కూర్చుని మాట్లాడుకోవాల్సింది: విఘ్నేశ్ శివన్)

Advertisement
 
Advertisement
Advertisement