శ్రీజ–నిఖత్‌ జంటకు స్వర్ణం | Srija-nikhath couple win golden medal | Sakshi
Sakshi News home page

శ్రీజ–నిఖత్‌ జంటకు స్వర్ణం

Jan 10 2019 12:13 AM | Updated on Jan 10 2019 12:13 AM

Srija-nikhath couple win golden medal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆకుల శ్రీజ–నిఖత్‌ బాను (తెలంగాణ) జంట స్వర్ణంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో శ్రీజ–నిఖత్‌ ద్వయం 11–2, 11–8, 8–11, 11–7తో అనన్య బసక్‌–సృష్టి (మహారాష్ట్ర) జోడీపై గెలిచింది. సెమీఫైనల్లో శ్రీజ–నిఖత్‌ జంట 7–11, 11–7, 15–13, 13–11తో అహిక– ప్రాప్తి సేన్‌ (పశ్చిమ బెంగాల్‌) జోడీని ఓడించింది.    

Advertisement
 
Advertisement
Advertisement