
గుత్తా జ్వాలకు మద్దతిస్తాం: మంత్రి జితేంద్ర
జీవితకాల ప్రతిపాదన ఎదుర్కొంటున్న బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు అవసరమైన మద్దతు అందిస్తామని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: జీవితకాల ప్రతిపాదన ఎదుర్కొంటున్న బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు అవసరమైన మద్దతు అందిస్తామని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ కేసును పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ ఉదంతం గురించి పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ రాసిన లేఖకు ఆయన పై స్పందించారు. జ్వాల అంశాన్నిపూర్తి స్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు చేపట్టాలని తన శాఖను ఆదేశించినట్లు జితేంద్ర తెలిపారు.
ఆమెకు తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. కాగా, ఆమెకు బాయ్ తో తలెత్తిన వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లిందని, కోర్టు ఉత్తర్వులు వెలువడిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.