సోని, కృష్ణలకు స్వర్ణాలు | Sony and Krishna gets Gold Medals in Taekwondo Championship | Sakshi
Sakshi News home page

సోని, కృష్ణలకు స్వర్ణాలు

Jul 16 2018 10:22 AM | Updated on Jul 16 2018 10:22 AM

Sony and Krishna gets Gold Medals in Taekwondo Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర తైక్వాండో చాంపియన్‌షిప్‌లో రింకూ సోని, కృష్ణ స్వర్ణాలను సాధించారు. వైఎంసీఏ నారాయణగూడలో జరిగిన ఈ టోర్నీలో సీనియర్‌ బాలికల విభాగంలో సోని విజేతగా నిలిచి పసిడిని గెలుచుకోగా... గౌతమి, పూజ వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. సీనియర్‌ బాలుర పూల్‌ ‘ఎ’ కేటగిరీలో బి. కృష్ణ, శ్లోక్, కరీమ్‌... పూల్‌ ‘బి’ విభాగంలో కరన్, వాసు, అనిల్‌ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు జాతీయ టోర్నీలో తలపడే తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. మలేసియాలో ఆగస్టు 24 నుంచి 26 వరకు తైక్వాండో ఇంటర్నేషనల్‌ చాంపియన్‌షిప్‌ జరుగనుంది.  

ఇతర వమో విభాగాల విజేతల వివరాలు
సబ్‌ జూనియర్‌ బాలురు: 1. ఆశ్రిత్, 2. ఆదిత్య, 3. అర్నవ్‌.

క్యాడెట్‌ బాలురు: 1. వితేశ్, 2. అద్వైత్, 3. సలీమ్‌.
జూనియర్‌ బాలురు: 1. అభిషేక్‌ లాల్, 2. విజేందర్‌ బాబు, 3. సాయి రిత్విక్‌.  
 బాలికలు: 1. అహానా రాయ్, 2. అనన్య.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement