45వ కెప్టెన్‌గా స్మిత్ | Smith named Australia's stand-in captain | Sakshi
Sakshi News home page

45వ కెప్టెన్‌గా స్మిత్

Dec 16 2014 1:16 AM | Updated on Sep 2 2017 6:13 PM

45వ కెప్టెన్‌గా స్మిత్

45వ కెప్టెన్‌గా స్మిత్

మైకేల్ క్లార్క్ గాయం కారణంగా దూరం కావడంతో మిగిలిన టెస్టులకు స్టీవెన్ స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

బ్రిస్బేన్: మైకేల్ క్లార్క్ గాయం కారణంగా దూరం కావడంతో మిగిలిన టెస్టులకు స్టీవెన్ స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కెరీర్ ఆరంభంలో కేవలం లెగ్‌స్పిన్నర్‌గా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చోటు దక్కించుకుంటూ వస్తున్న స్మిత్ ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్థాయికి ఎదగడం విశేషం. ముఖ్యంగా గత రెండేళ్లలో అతని ఆటతీరు చాలా మెరుగైంది. అద్భుతమైన ప్రదర్శనతో స్మిత్ టెస్టుజట్టులోనూ ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు.

క్రెయిగ్, కిమ్ హ్యూస్ తర్వాత పిన్న వయసులో ఆసీస్ కెప్టెన్సీ దక్కించుకున్న ఆటగాడిగా 25 ఏళ్ల స్మిత్ గుర్తింపు పొందాడు. ‘ప్రస్తుతానికి ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. గత 18 నెలలు నా కెరీర్‌లో గొ ప్ప క్షణాలుగా నిలిచాయి. కెప్టెన్ కావడం ఉద్వేగంగా ఉంది.

ఇప్పటి వరకు ఆసీస్ ఎలా ఆడిందో అదే తరహాలో ముందుకు వెళతాం తప్ప నేను ఒక్కసారిగా ప్రణాళికలు మార్చేయను. ఒక్కసారి ఆట మొదలైతే గెలవడంపైనే దృష్టి ఉంటుంది తప్ప ప్రత్యర్థితో స్నే హం చేయలేం. నేను కూడా బాగా ఆడి ముందుండి జట్టును నడిపిస్తాను’ అని స్మిత్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement