breaking news
Australia captaincy
-
ఆసీస్ కెప్టెన్‌గా వార్నర్.. ఫించ్ మద్దతు కూడా ఇతనికే..!
ఆసీస్ వన్డే కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ వైదొలిగిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న డిస్కషన్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కొందరేమో టెస్ట్ సారధి పాట్ కమిన్స్‌కే వన్డే కెప్టెన్సీ కూడా కట్టబెట్టాలని అంటుంటే.. మరికొందరేమో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరును సూచిస్తున్నారు. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉండేందుకు వార్నర్ సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, 2018 బాల్ టాంపరింగ్ వివాదంలో వార్నర్‌పై జీవితకాల నిషేధం (కెప్టెన్సీ విషయంలో) ఉన్న నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏ విధంగా స్పందిస్తుందో వేచి చేడాల్సి ఉంది. సమస్యను పరిష్కరించుకునేందుకు (బ్యాన్ ఎత్తివేత) డేవిడ్ భాయ్ స్వయంగా రంగంలోకి దిగి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో అతనికి తాజాగా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అలాగే పలువురు క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దల మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫించ్ స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి కూడా వైదొలుగుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసమే వార్నర్ కూడా ఎదురుచూస్తున్నాడని అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మెగా టోర్నీ తర్వాత ఫించ్ పొట్టి ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటే.. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ మొత్తం కోసం పావులు కదపాలన్నది వార్నర్ ప్లాన్‌గా తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వార్నర్ టీ20 వరల్డ్‌కప్ అనంతరం ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. -
45వ కెప్టెన్‌గా స్మిత్
బ్రిస్బేన్: మైకేల్ క్లార్క్ గాయం కారణంగా దూరం కావడంతో మిగిలిన టెస్టులకు స్టీవెన్ స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కెరీర్ ఆరంభంలో కేవలం లెగ్‌స్పిన్నర్‌గా పరిమిత ఓవర్ల క్రికెట్లో చోటు దక్కించుకుంటూ వస్తున్న స్మిత్ ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్థాయికి ఎదగడం విశేషం. ముఖ్యంగా గత రెండేళ్లలో అతని ఆటతీరు చాలా మెరుగైంది. అద్భుతమైన ప్రదర్శనతో స్మిత్ టెస్టుజట్టులోనూ ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. క్రెయిగ్, కిమ్ హ్యూస్ తర్వాత పిన్న వయసులో ఆసీస్ కెప్టెన్సీ దక్కించుకున్న ఆటగాడిగా 25 ఏళ్ల స్మిత్ గుర్తింపు పొందాడు. ‘ప్రస్తుతానికి ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. గత 18 నెలలు నా కెరీర్లో గొ ప్ప క్షణాలుగా నిలిచాయి. కెప్టెన్ కావడం ఉద్వేగంగా ఉంది. ఇప్పటి వరకు ఆసీస్ ఎలా ఆడిందో అదే తరహాలో ముందుకు వెళతాం తప్ప నేను ఒక్కసారిగా ప్రణాళికలు మార్చేయను. ఒక్కసారి ఆట మొదలైతే గెలవడంపైనే దృష్టి ఉంటుంది తప్ప ప్రత్యర్థితో స్నే హం చేయలేం. నేను కూడా బాగా ఆడి ముందుండి జట్టును నడిపిస్తాను’ అని స్మిత్ చెప్పాడు.