
వాట్సన్ ఫిట్ గా ఉన్నాడు:స్మిత్
ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఫిట్ గానే ఉన్నాడని కెప్టెన్ స్టీవెన్ స్మిత్ స్పష్టం చేశాడు.
సిడ్నీ: ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ చివరి టెస్టులో ఆడటానికి ఫిట్ గానే ఉన్నాడని కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. టీమిండియాతో మంగళవారం నుంచి జరుగనున్న నాల్గో టెస్టులో వాట్సన్ పాల్గొంటాడని స్మిత్ తెలిపాడు. 'ఆవేశితపూరిత' విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తొలి టెస్టులో అతని నాయకత్వ ప్రతిభ ఆకట్టుకుందని స్మిత్ అన్నాడు.
ఇదిలా ఉండగా గాయపడ్డ మిచెల్ జాన్సన్ స్థానంలో స్టార్క్ తుదిజట్టులోకి రానున్నాడు. టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ టెస్టుల నుంచి వైదొలగడంతో విరాట్ కోహ్లీ రేపటి మ్యాచ్ కు బాధ్యతలు తీసుకోనున్నాడు.