చాంపియన్‌ శ్రీశ్వాన్‌ | Sivan Took Bronze Medal in the Rapid Team | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ శ్రీశ్వాన్‌

Apr 11 2019 3:01 AM | Updated on Apr 11 2019 3:01 AM

Sivan Took Bronze Medal in the Rapid Team - Sakshi

శ్రీలంక: ఆసియా యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ శ్రీశ్వాన్‌ సత్తాచాటాడు. శ్రీలంకలోని వాస్కదువా వేదికగా జరిగిన ఈ టోర్నీలో 2 స్వర్ణాలు, ఒక కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అండర్‌–14 బాలుర వ్యక్తిగత విభాగంలో శ్రీశ్వాన్‌ చాంపియన్‌గా నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల అనంతరం 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని అం దుకున్నాడు. అతను ఏడు గేముల్లో గెలిచి రెండింటిని డ్రా చేసుకొని అజేయంగా నిలిచాడు. మరోవైపు క్లాసికల్‌ టీమ్‌ కేటగిరీలో స్వర్ణాన్ని కైవసం చేసుకున్న శ్రీశ్వాన్‌... ర్యాపిడ్‌ టీమ్‌ విభాగంలో కాంస్య పతకా న్ని సాధించాడు. అండర్‌–8 బాలుర విభాగంలో మేకల మహేంద్ర తేజ రన్నరప్‌గా నిలిచాడు. అతను 7 పాయింట్లతో రెండోస్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్‌–16 బాలుర విభాగంలో కుషాగ్ర మోహన్‌ 5 పాయింట్లతో పదకొండో స్థానంలో నిలిచాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement