ప్రిక్వార్టర్స్‌లో సింధు, సాయిదేదీప్య | sindhu and sai dedeepya enter pre quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సింధు, సాయిదేదీప్య

Jun 13 2017 2:38 PM | Updated on Sep 5 2017 1:31 PM

ప్రిక్వార్టర్స్‌లో సింధు, సాయిదేదీప్య

ప్రిక్వార్టర్స్‌లో సింధు, సాయిదేదీప్య

అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయిలు సింధు జనగాం, సాయిదేదీప్య శుభారంభం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయిలు సింధు జనగాం, సాయిదేదీప్య శుభారంభం చేశారు. కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సాయిదేదీప్య 6–1, 6–2తో అవిష్క గుప్తాపై గెలుపొందింది.

 

మరో మ్యాచ్‌లో సింధు 6–3, 6–3తో గాయత్రి శంకర్‌ (కేరళ)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో మౌలిక (ఏపీ) 3–6, 6–2, 7–6 (7/2)తో ఆస్థా (మహారాష్ట్ర)పై, ఇస్కా తీర్థ (ఏపీ) 6–1, 6–2తో ప్రవీణపై, నిధి సూరపనేని 6–0, 6–0తో పూర్వ రెడ్డి, లాస్య పట్నాయక్‌ 6–2, 7–6తో అద్వైతపై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement