ష్... మాటల్లేవ్! | silent between Kohli and Stokes | Sakshi
Sakshi News home page

ష్... మాటల్లేవ్!

Nov 29 2016 2:55 PM | Updated on Sep 4 2017 9:21 PM

ష్... మాటల్లేవ్!

ష్... మాటల్లేవ్!

మొహాలీ టెస్టులో వరుసగా మూడో రోజు కూడా కోహ్లి, స్టోక్స్ మధ్య ఘర్షణ కొనసాగింది.

మొహాలీ టెస్టులో వరుసగా మూడో రోజు కూడా కోహ్లి, స్టోక్స్ మధ్య ఘర్షణ కొనసాగింది. తొలి రోజు ఇద్దరూ మాటలతో కత్తులు దూస్తే... ఆ తర్వాత ఇద్దరూ సైగలతోనే తమ ‘భావాన్ని’ ప్రదర్శించారు! టెస్టు మొదటి రోజు స్టోక్స్ అవుటై వెళుతూ కోహ్లిని ఏదో అనడంతో అతను తిరిగి జవాబివ్వడం, ఆ తర్వాత స్టోక్స్‌ని తప్పు పట్టి ఐసీసీ హెచ్చరించడం తెలిసిందే. రెండో రోజు స్టోక్స్ బౌలింగ్‌లోనే కోహ్లి అవుటయ్యాడు. జట్టు సంబరాలు చేసుకుంటున్న సమయంలో ‘నేను మాత్రం ఏమీ మాట్లాడను’ అన్నట్లుగా స్టోక్స్ తన నోటిపై చేరుు పెట్టి చూపించాడు. సోమవారం కోహ్లి మళ్లీ అదే తరహాలో బదులిచ్చాడు.

అశ్విన్ వేసిన చివరి ఓవర్లో బంతి స్టోక్స్ ప్యాడ్‌కు తగలడంతో అశ్విన్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించారు. అరుుతే కోహ్లి దీనిపై రివ్యూ కోరాడు. ఫలితం భారత్‌కు అనుకూలంగా రావడంతో స్టోక్స్ నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ సమయంలో కోహ్లి తన పెదాలను వేలితో మూసి అతడిని సాగనంపడం విశేషం! 2002లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్, నాటి కెప్టెన్ గంగూలీ మధ్య వివాదాన్ని ఇది గుర్తుకు తెచ్చింది. నాడు ముంబైలో వన్డే గెలిచాక ఫ్లింటాఫ్ షర్ట్ విప్పి సంబరాలు చేసుకోగా, ఐదు నెలల తర్వాత లార్డ్స్‌లో విజయానంతరం గంగూలీ అదే చేసి చూపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement