శ్యామ్ కుమార్‌కు కాంస్య పతకం | shyam kumar wins bronze medal in international boxing tourney | Sakshi
Sakshi News home page

శ్యామ్ కుమార్‌కు కాంస్య పతకం

Dec 7 2015 2:22 AM | Updated on Sep 3 2017 1:36 PM

శ్యామ్ కుమార్‌కు కాంస్య పతకం

శ్యామ్ కుమార్‌కు కాంస్య పతకం

ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించాడు.

రియో డి జనీరో (బ్రెజిల్): ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించాడు. పురుషుల 51 కేజీల విభాగం సెమీఫైనల్లో హసన్‌బాయ్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో శ్యామ్ ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కే చెందిన మనోజ్ కుమార్ (64 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), ప్రవీణ్ కుమార్ (91 కేజీలు) కూడా సెమీఫైనల్లో ఓటమిపాలై కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. మహిళల విభాగంలో మేరీకామ్ (51 కేజీలు) కూడా కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌కు ఐదు కాంస్య పతకాలు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement