ఐపీఎల్‌ చరిత్రలో నాల్గో కెప్టెన్‌గా.. | Shreyas Iyer joined an elite list by becoming the only fourth cricketer to hit a fifty on IPL captaincy debut | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ చరిత్రలో నాల్గో కెప్టెన్‌గా..

Apr 27 2018 10:30 PM | Updated on Apr 27 2018 10:32 PM

Shreyas Iyer joined an elite list by becoming the only fourth cricketer to hit a fifty on IPL captaincy debut - Sakshi

ఢిల్లీ: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ  డేర్‌డెవిల్స్‌ కెప్టెన్‌గా గౌతం గంభీర్‌ వైదొలగడంతో శ్రేయస్‌ అయ్యర్‌కు సారథ్య బాధ్యతల్ని అప్పగించిన సంగతి తెలిసిందే. దాంతో శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు ఢిల్లీకి అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే సారథిగా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే శ్రేయస్‌ అయ్యర్‌ అదరగొట్టాడు. 40 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 93 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో కెప్టెన్‌గా వ్యహరించిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించిన నాల్గో క్రికెటర్‌గా అయ్యర్‌ నిలిచాడు.

అంతకుముందు 2008లో గిల్‌ క్రిస్ట్‌(డెక్కన్‌ చార్జర్స్‌), 2013లో అరోన్‌ ఫించ్‌(పుణె వారియర్స్‌),  2016లో మురళీ విజయ్‌(కింగ్స్‌ పంజాబ్‌)లు కెప్టెన్లుగా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీలు సాధించిన క్రికెటర్లు. కాగా, కెప్టెన్లుగా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరును అయ్యర్‌ సాధించడం ఇక్కడ మరో విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement