శ్రేయస్‌ అయ్యర్‌కు లవ్‌ ప్రపొజల్!

Shreyas Iyer Instagram Chatting - Sakshi

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో తమ జట్టు భారీ తేడాతో ఓడిపోయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రం హాస్యచతురతను కోల్పోలేదు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సరదాగా ముచ్చటించాడు. ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు కూల్‌గా జవాబులు ఇచ్చాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 80 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఓటమి బాధ కలిగించినా తన స్థైర్యాన్ని దెబ్బతీయలేదని అయ్యర్‌ పేర్కొన్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో అయ్యర్‌ సంభాషణ ఇలా..
అభిమాని: ఎందుకు చాలా హాట్‌గా ఉన్నారు?
అయ్యర్‌:  ఇది వేసవి కాలం కదా అందుకే..
అభిమాని: మ్యాచ్‌లు ఆడేటప్పుడు మీరు ఏ క్రీమ్‌ వాడతారు?
అయ్యర్‌:  ఐస్‌క్రీమ్‌!
అభిమాని: మీ అభిమాన కెప్టెన్‌ ఎవరు?
అయ్యర్‌:  కెప్టెన్‌ అమెరికా!
అభిమాని: ఆటోగ్రాఫ్‌తో మీ బ్యాట్‌ నాకు ఇవ్వగలరా?
అయ్యర్‌:  నా బ్యాట్‌ నీకు ఇచ్చేస్తే నేనేలా ఆడాలి?
అభిమాని: మీరు మెచ్చిన ఐడల్‌?
అయ్యర్‌:  ఇండియన్‌ ఐడల్‌!

మీకు ఇష్టమైన కలర్‌, ఫుడ్‌ ఏంటని అయ్యర్‌ను కొంతమంది అడిగారు. మీ కూల్‌నెస్‌ నచ్చిందని, మిమ్మల్ని ప్రేమిస్తున్నామని కొంత అమ్మాయిలు ప్రపోజ్‌ చేశారు. ఢిల్లీ క్యాపిటల్‌ ఐపీఎల్‌ విజేతగా నిలుస్తుందా అని అడిగారు. వన్డే ప్రపంచకప్‌ జట్టు ఎంపికపై ఏమంటారని ఒకరు ప్రశ్నించారు. విరాట్‌ కోహ్లి షాట్లలో మీకు నచ్చిన షాట్‌ ఏది, ఎంఎస్‌ ధోని మీ అభిప్రాయం ఏంటని మరికొందరు అడిగారు. అయ్యర్‌ అభిమాన ఆటగాడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top