మానవ్‌జిత్‌కు కాంస్యం | Shooting: Manavjit wins bronze; misses out Olympic quota | Sakshi
Sakshi News home page

మానవ్‌జిత్‌కు కాంస్యం

Mar 5 2015 12:42 AM | Updated on Sep 2 2017 10:18 PM

మానవ్‌జిత్‌కు కాంస్యం

మానవ్‌జిత్‌కు కాంస్యం

భారత అగ్రశ్రేణి షూటర్ మానవ్‌జిత్ సింగ్ సంధూ అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచ కప్ షాట్‌గన్ టోర్నమెంట్‌లో కాంస్య పతకం సాధించాడు.

అకాపుల్కో (మెక్సికో): భారత అగ్రశ్రేణి షూటర్ మానవ్‌జిత్ సింగ్ సంధూ అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచ కప్ షాట్‌గన్ టోర్నమెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో మానవ్‌జిత్ మూడో స్థానాన్ని సంపాదించాడు.
 
 ఒకవేళ మానవ్‌జిత్ ఫైనల్‌కు చేరుకొని ఉంటే వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించేవాడు. కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో మానవ్‌జిత్, జోవో అజెవెడో (పోర్చుగల్) 12 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో ఇద్దరి మధ్య ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ‘షూట్ ఆఫ్’లో మానవ్‌జిత్ మూడు పాయింట్లు స్కోరు చేయగా... అజెవెడో రెండు పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement